జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ గా వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి

SMTV Desk 2018-08-29 21:29:53  amrapali,collecter,ghmc,warangal,telangana

జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ గా వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ గా ఉన్న భారతి హొళికేరిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న శశాంకను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయగా, వ్యవసాయశాఖ కమిషనర్ గా రాహుల్ బొజ్జాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా రజత్ కుమార్ సైనీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బదిలీని ప్రభుత్వం రద్దు చేసింది.తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డ విషయం తెలిసిందే. కాగా ఇందులో స్వల్ప మార్పులు చేసుకున్నాయి.