హైదరాబాద్ లో వాజపేయి విగ్రహం

SMTV Desk 2018-08-29 15:26:59  Hyderabad, Vajpayee Statue, Atal Bihari Vajpayee

హైదరాబాద్ లో మాజీ ప్రధాని శ్రీ అటల్ బీహారీ వాజపేయి విగ్రహం నెలకొల్పాలని బిజెపి నాయకులు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్, శాసనసభ పక్ష నాయకుడు శ్రీ కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ చింతల రామచంద్రారెడ్డి, శ్రీ ప్రభాకర్, ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రారావు మంగళవారం ప్రగతి భవన్ లో సీఎంను కలిశారు. హైదరాబాద్ లో వాజపేయి విగ్రహంతోపాటు స్మారక మందిరం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.