ఇంటికి చేరిన హరికృష్ణ పార్థివదేహం

SMTV Desk 2018-08-29 15:03:38  nandamuri harikrishna, harikrishna dead news, ntr, kalyanram, kcr,

టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అనంతరం అయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ లోని మెహదీపట్నంలో గల నివాసానికి తీసుకువచ్చారు. ఉదయం పెళ్ళికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన అయన, మరణించారన్న వార్త విన్న కుటుంబంలో ఒక్కసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణ మృతదేహాని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు.