కేటీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన కాంగ్రెస్ నేత

SMTV Desk 2018-08-28 18:41:35  Revanth reddy, KTR,

తెలంగాణలో ముందస్తు ఎన్నికల సంకేతాలతో రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు కాంగ్రెస్ భ‌య‌ప‌డుతోంద‌న్న కేటీఆర్ విమ‌ర్శ‌ను రేవంత్ తిప్పి కొట్టారు. 133 సంవ‌త్స‌రాల సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాదాపు 50 యేళ్లుపాటు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉంద‌నీ, త‌మ‌కు ఎన్నిక‌లు కొత్త‌కాద‌ని రేవంత్ అన్నారు. ఎన్నిక‌లంటే త‌మ‌కు భ‌య‌మ‌ని కేటీఆర్ అనుకోవ‌డం అవ‌గాహ‌నా రాహిత్యమ‌న్నారు.టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న రేంజ్‌లో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కేటీఆర్- కాంగ్రెస్ నేత రేవంత్‌ల మధ్య ఈ డైలాగ్ వార్ మరింత ముదిరింది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌య‌మై ఎన్న‌డూ ప్ర‌ధానిని క‌ల‌వ‌ని కేటీఆర్‌, కేసీఆర్ లు… ఈ మ‌ధ్య ఢిల్లీ చుట్టూ ఎందుకు చ‌క్క‌ర్లు కొడుతున్నార‌న్నారు..? స‌రైన స‌మ‌యంలో ఎన్నిక‌లు జ‌రిగితే తెలంగాణ‌లో తెరాస అడ్ర‌స్ గ‌ల్లంతు అవుతుంద‌నీ, ఆ విష‌యం వారు చేయించుకున్న 14 స‌ర్వేల ద్వారా తెలియ‌డం వ‌ల్ల‌నే తండ్రీ కొడుకులు భ‌య‌ప‌డుతున్నార‌న్నారు.