తండ్రికి దొరికిపోయిన లవర్స్‌ ,వైరల్ వీడియో

SMTV Desk 2018-08-27 11:51:37  Warangal, Father beat daughter in cinema hall,

చదువుకోమని పంపిస్తే ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందో యువతి. అనూహ్యంగా తండ్రికి దొరికింది. దీంతో తండ్రికి ఒళ్ళు మండి చితకబాదాడు.గుండెలపై పెట్టుకుని పెంచిన కన్నకూతురు చేస్తున్న నిర్వాకం చూసిన తండ్రి గుండె బద్దలైంది. తన పెంపకానికే మచ్చ తెచ్చేలా చేసిన కూతురును, పబ్లిక్ లోనే చితకబాదాడు. ఈ ఘటన వరంగల్ లోజరిగింది. ఫెస్టివల్ మూడ్.. పైగా సండే.. కావడంతో ప్రేమికులిద్దరు సరదాగా s2 సినిమా హాల్ కు వచ్చారు. టికెట్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్లారు. అయితే అంతలోనే సీన్ కాస్త రివర్స్ అయింది.ఊహించని విధంగా అదే థియేటర్ కు ఆమె తండ్రి వచ్చాడు. ప్రియుడితో ఉన్న కూతురును చూసిన ఆ కన్నతండ్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతావని తాము ఆశపడుతుంటే... నీవు చేసే నిర్వాకం ఇదా? అంటూ మండిపడ్డాడు. ప్రేమికులిద్దరినీ పరుషపదజాలంతో దూషించాడు. చుట్టుపక్కల ఉన్నవారు ఆయనను శాంతపరిచేందుకు యత్నించినప్పటికీ... ఆయనలోని ఆగ్రహం చల్లారలేదు.