టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

SMTV Desk 2018-08-27 11:03:19  Former Indian Cricketer, Gopal Bose

భార‌త్‌ మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ దిగ్గజం గోపాల్ బోస్(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బోస్ మృతిపై టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. బోస్ తన కెరీర్‌లో 78 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. ఇందులో మొత్తం ఎనిమిది సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేసిన ఆయన మొత్తం 30.79 యావరేజ్‌తో 3757 పరుగులు చేశారు. మరోవైపు ఎనిమిది లిస్ట్-ఏ మ్యాచులు ఆడిన ఆయన మొత్తం 115 పరుగులు చేశారు. కాగా 1973-74లో బోస్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.