రాజశేఖర్ ‘కల్కి’మోషన్ పోస్టర్

SMTV Desk 2018-08-26 17:28:59  Rajashekhar, kalki, Prashanth Varma

ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాకు ‘ కల్కి ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అ’ ఫేం ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అంతేకాకుండా మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. యానిమేషన్‌తో కూడిన టైటిల్ మోషన్ పోస్టర్‌ చూస్తుంటే సినిమాపై ఇప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. శివానీ శివాత్మిక మూవీస్ స‌మ‌ర్పణ‌లో హ్యపీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం అవుతుంది. మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వర‌లోనే తెలియ‌జేస్తారు. కాగా, 1983లో తెలంగాణలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ కోణంలో తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్ ‘కల్కి’. గత ఏడాది రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాజశేఖర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ)లో అసిస్టెంట్ కమిషనర్‌గా నటించి ఆకట్టుకున్నారు. పూజా కుమార్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఎం.కోటేశ్వర్‌రావు గరుడవేగను నిర్మించారు.