నటి ప్రియ సంచలన కామెంట్స్

SMTV Desk 2018-08-26 11:48:56  Actor Priya, Sri reddy, casting couch

సినీ పరివ్రమలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం ఇంకా సద్దుమణగనే లేదు... వర్ధమాన నటి ప్రియ భవాని శంకర్ మరోసారి పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశాన్ని లేవనెత్తింది.మెయ్యాద మానే చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బుల్లితెర నటి ఇప్పుడు వెండి తెరపై హీరోయిన్‌గా బిజీ అవుతోంది. ఇటీవల కార్తీకి జంటగా కడైకుట్టి సింగం చిత్రంలోనూ నటించింది. కాగా శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ భామ నటి శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ సినిమా రంగంలో హీరోయిన్లకు అత్యాచారం వేధింపులు అన్నది కొట్టిపారవేయలేమని అంది. ఈ వేధింపులు అన్ని రంగాల్లో ఉన్నాయని ప్రియ చెప్పింది. అయితే, వాటిని అంగీకరించడం, నిరాకరించడం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. లైంగిక వేధింపుల గురించి శ్రీరెడ్డి బహిరంగంగా చెప్పడం సరికాదని చెప్పింది. తప్పు చేసి, బయటకు చెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. వేధింపుల బారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు కదా అని తెలిపింది. తాను మాత్రం కుటుంబ కథా చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నానని ఈ అమ్మడు చెప్పింది.