వైసిపిలోకి మాజీ డీజీపి

SMTV Desk 2018-08-25 19:12:47  YSRCP, Jagan Mohan reddy, former DGP

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. అచ్యుతాపురం సమీపంలోని ధారభోగాపురం వద్ద ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద జగన్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఇరువురు దాదాపు 15 నిమిషాలు చర్చించుకున్నారు. సాంబశివరావు తమ పార్టీలోకి రావడం శుభ పరిణామమని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. తాము సాంబశివరావు సలహాలూ సూచనలూ తీసుకుంటామని చెప్పారు. సాంబశివ రావు 1984 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్. ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఎపిఎస్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినవారు.