జీవో 550పై హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు

SMTV Desk 2018-08-24 18:35:57  Supreme court, GO 550, High court

జీవో 550పై హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టివేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ జీవో ప్రకారమే వైద్య విద్య సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. జీవోలోని క్లాజ్-2ని హైకోర్టు రద్దు చేయడాన్ని తప్పుబట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ప్రస్తుతం జరుగుతున్న ప్రవేశాలకు కూడా ఆటంకం కలిగించొద్దని సూచించింది. జీవోలో ఒక పార్టు 5.2ని తప్పని చెప్పి హైకోర్టు రద్దు చేసిందో... ఆ తీర్పు తప్పని చెప్పి.. దాన్ని శుక్రవారం సుప్రీం కోర్టు సెటరైజ్ చేస్తూ, 550 జీవో 2001 నుంచి 2017 వరకు మాన్యువల్‌గా జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవని, ఇవాళ ఆన్‌లైన్ సిస్టమ్ రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి జీవోను కన్ఫార్మ్ చేస్తూ... తెలుగు రాష్ట్రాలు సవరణలు చేసుకోవచ్చని న్యాయస్థానం సూచిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది జరిగిన అడ్మిషన్లు అలాగే కొనసాగించాలని సుప్రీం కోర్టు పేర్కొంది.