24 కిసెస్ ట్రైలర్: ముద్దుల్లో మునిగి తేలితూ

SMTV Desk 2018-08-24 15:51:06  24 kisses, Trailer, Hebah patel

కుమారి 21 ఎఫ్ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన హెబ్బా పటేల్..మొదటి సినిమాతోనే యూత్ కావాల్సిన మజా ను ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అమ్మడి తలుపు తట్టాయి. అలాగే సక్సెస్ లు కూడా అమ్మడికి ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం ఈమె 24 కిసెస్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయోధ్య కుమర్ క్రిష్ణంశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ హీరోహిరోయిన్లు. కీలక పాత్రలో రావు రమేశ్ నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్, టీజర్ ద్వారా ఈ సినిమా యువతలో ఆసక్తి రేపింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఇది చూసిన ప్రేక్షకులు ట్రైలర్ లోనే ఇన్ని కిస్సెస్ ఉంటే సినిమాలో ఎన్ని ఉన్నాయోనని అంటున్నారు. ఇక ఈ సినిమా యూత్ కు మంచి కిక్ ఇవ్వడం ఖాయమనిస్తుంది. కుమారి 21ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. సినిమాలతో కుర్రకారులో మంచి మార్కులు కొట్టేసింది హెబ్బా. ఇంత వరకూ గ్లామరస్ గా కనిపిస్తూ కనివిందు చేసిన హెబ్బా ఈ సినిమాలో ముద్దుల్లో మునిగి తెలితూ.. కుర్రాళ్లకు మత్తునిచ్చేలా కనిపిస్తోంది.