హైదరాబాద్‌లో వాట్సాప్ కార్యాలయం!

SMTV Desk 2018-08-24 15:06:15  Hyderabad, Whatsapp , KTR, telanagana, facebook

భారత పర్యటనలో ఉన్న వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్ హైదరాబాద్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. వాట్సాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని క్రిస్ ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ డివిజన్ ఇండియా హెడ్ శివనాథ్ తుక్రాల్ కూడా మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఫేస్‌బుక్ 2010లో తన ఆసియా హబ్‌ను తొలిసారి హైదరాబాదులో ప్రారంభించింది. ఇదే ఫేస్‌బుక్ 2014లో వాట్సాప్‌ను స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల క్రితం వాట్సాప్ సీఈవో కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్‌ను కూడా కలిశారు.