ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నిర్లక్ష్య ధోరణి

SMTV Desk 2018-08-24 13:11:31  , AccidentAp Deputy cm KE Krishna Murthy

కర్నూలు జిల్లాలోని సి. బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయిలోని ఓ కారు చిన్న పిల్లాడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడు పొలకల్ గ్రామానికి చెందిన దిలీప్ (7)గా గుర్తించారు.