జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన పవన్

SMTV Desk 2018-08-14 20:12:30  Janasena, Janasena Manifesto, Pawan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ప్రీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. విజన్ డాక్యుమెంట్ పేరుతో ఆయన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించారు. పూర్తి స్థాయి మ్యానిఫెస్టో ఎన్నికలకు ముందుకు విడుదల చేయనున్నారు. వీటిలో ముఖ్యమైనవి… – రేషన్ కు బదులు మహిళల ఖాతాలో రూ.2,500 – 3,000 నగదు జమ. – ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం. – మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు – చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు – బీసీలకు ఇంకా 5 శాతం రిజర్వేషన్లు పెంపు – గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు – కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు – ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్, విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహాలు – ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు