ఉప రాష్ట్రపతి పోస్టు నాకు ఇష్టం లేదు.? !

SMTV Desk 2017-07-17 11:40:00  I, do, not, like, vice, president, post

న్యూఢిల్లీ, జులై 17 : ఉప రాష్ట్రపతి గా నాకిష్టం లేదని బహిరంగంగానే చెబుతున్నారు వెంకయ్యనాయుడు. కానీ మోదీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని తిరస్కరించే సాహసం వెంకయ్యనాయుడు చేస్తారా.? సోమవారం సాయంత్రానికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించి బిజెపి వ్యవహారాల్లో ఆయనే చక్రం తిప్పుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ఉప రాష్ట్రపతి గా ఎన్నికయితే వెంకయ్యనాయుడి యాక్టివ్ పాలిటిక్స్ కు తెరపడినట్లే. వెంకయ్యనాయుడు పేరును ఎన్డీఏ అధికారికంగా ప్రకటిస్తే దక్షిణాదికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్నిక చేసినట్టు అవుతుందనే భావనతో మోదీ ఉన్నట్లు చెబుతున్నారు.