నిరుద్యోగులకు శుభవార్త..

SMTV Desk 2018-07-19 18:09:23  tspsc notification, ghmc, tspsc notification, group 4

హైదరాబాద్‌, జూలై 19 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండు వేర్వేరు ప్రకటనల్ని విడుదల ప్రకటించింది. జీహెచ్ఎంసీలో 124 బిల్ కలెక్టర్లు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీల భర్తీకి ప్రకటన జారీచేసింది. ఈ రెండు ఉద్యోగాలకు రాష్ట్రప్రభుత్వం రెండేళ్ల క్రితమే అనుమతులు ఇచ్చినా రోస్టర్‌, సిలబస్‌, పరీక్ష విధానం, సర్వీసు నిబంధనలు రూపొందించడంలో ఆలస్యమైంది. వీటిని గ్రూప్‌ -4లో విలీనం చేయాలని భావించినా ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా ఉండటంతో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మరోవారంలో హెల్త్‌ అసిస్టెంట్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలతో 85 ఉద్యోగాలకు మరో ప్రకటన ఇచ్చేందుకు కసరత్తు పూర్తిచేసింది. హెల్త్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఇంటర్‌ బయాలజీ, శానిటరీ సూపర్‌వైజర్‌కు డిగ్రీ బయాలజీ అర్హతలుగా ఉండే అవకాశం ఉంది.