రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయడానికి వీల్లేదు..

SMTV Desk 2017-07-16 17:29:54  presedent, mp, mla, voting system, elections, cross voting

హైదరాబాద్, జూలై 16 : రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయడానికి వీల్లేదని ఒకవేళ విప్ జారీ చేసిన దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలా ఓటు వేయాలో చెప్పేశారు. ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకె వేయాలి. రెండో ప్రాధ్యాన్యత ఓటు వేయాలంటే ఆ నెంబర్ గడిలో రాయాలి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలంతా కోల్‌కతాలో తన కనుసన్నల్లోనే ఓట్లు వేయాలని ఆదేశించారు మమతాబెనర్జీ. రాష్ట్రపతి ఎన్నికల్లో తీవ్రమైన పోటీ కనిపించడం లేదు. ఒకవేళ నువ్వానేనా అన్నట్లు సాగితే మాత్రం క్రాస్ ఓటింగ్‌కే ఎక్కువ అవకాశం ఉంది. చిన్న పార్టీలు తప్ప పెద్ద పార్టీల సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడరని భావిస్తున్నారు. ఒకవేళ ప్రజా ప్రతినిధులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడవచ్చు. కాని భారీ స్థాయిలో ఏమి ఉండదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రం బీజేపీకి ఉంది కాని మామూలు ఎమ్మెల్యే కన్నా యూపీ ఎమ్మెల్యే విలువ రెట్టింపు ఉంది. ఒక యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132, ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ 159. మొత్తం ఓట్ల విలువ 10,9800 కాగా రాంనాథ్ కోవింద్‌కు 6 లక్షల 81 ఓట్లు వచ్చే అవకావం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.