ఏపీలో తొమ్మిది మంది ఐపీఎస్‌ల బదిలీ..

SMTV Desk 2018-07-18 12:23:18  ips officers transfer in ap, ips officers ap, vijyawada, amaravathi

అమరావతి, జూలై 18 : రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. న్యవాంధ్ర రాజధాని పరిధిలో అత్యంత కీలకమైన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమల రావును ప్రభుత్వం ఎంపిక చేసింది. అలాగే రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా ఇంటెలిజెన్స్‌ ఐజీ మహేశ్‌ చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది. ఈ రెండు నియామకాలతో పాటు మరో ఏడుగురు ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా బదిలీ అయిన ఐపిఎస్ అధికారుల వివరాలు.. >> ద్వారకా తిరుమలరావు...విజయవాడ కమిషనర్‌; >> మహేశ్‌ చంద్ర లడ్డా...విశాఖపట్నం కమిషనర్‌; >> టి. రవికుమార్‌ మూర్తి... ఏలూరు రేంజ్‌ డీఐజీ; >> డా. షేముషి బాజ్‌పాయ్‌...ఎస్పీ, రాజమండ్రి అర్బన్‌; >> బి. రాజకుమారి...డీసీపీ, విజయవాడ క్రైమ్స్‌; >> బి. కృష్ణారావు...ఏఎస్‌పీ, తుళ్లూరు; >> రాహుల్‌ దేవ్‌ సింగ్‌...ఏఎస్పీ,రంపచోడవరం; >> అజితా వేజెండ్ల...ఏఎస్పీ, రాజమండ్రి అర్బన్‌.