వైరల్ : నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రొఫైల్ పిక్..

SMTV Desk 2018-07-16 17:37:34  bollywood actor irfan khan, social media profile pic goes viral,

హైదరాబాద్, జూలై 16 : కేన్సర్ ఎప్పుడు, ఎవరిని, ఎలా అటాక్ చేస్తుందో చెప్పలేం. ఈ ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్న సినిమా స్టార్స్ ను మనం చూస్తూనే ఉన్నాం. వీరంతా ధైర్యంగా ఎదురుకుని మళ్ళీ సినిమాల్లో తమ సత్తా చాటుతున్నారు. కానీ వీళ్ళ కన్నా తీవ్రమైన వ్యాధికి గురై బ్రతుకుతాడా అనే భయాన్ని కలిగించిన ఇర్ఫాన్ ఖాన్.. ఆ మహమ్మారిని జయించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం న్యూరో ఎండోక్రైనో అనే వ్యాధి చికిత్స కోసం లండన్ తో పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న ఇర్ఫాన్.. ఈమధ్యే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి తన సోషల్ మీడియా పిక్ ను మార్చుకున్నాడు. ఈ ఫోటోలో ఆయన మొహం బాగా పీక్కుపోయి, బక్కచిక్కపోయి ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ ఇంతటి విచారాన్ని కూడా ఈ నటుడు చిరునవ్వుతో భరిస్తున్నాడు. శరీరం ఎంత బలహీన పడినా ఇర్ఫాన్‌ ధైర్యం మాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనం అతని మోముపైన చిరునవ్వే. అయితే ఈ ఫోటో అభిమానులను విపరీతంగా కదిలించడమే కాక తెగ వైరల్‌ అవుతుంది. లండన్‌ వెళ్లిన తర్వాత ఈ నటుడు "కర్వాన్‌"లో తనతో పాటు నటించిన దుల్కర్‌ సల్మాన్‌, మిథిలా పాకర్‌కు శుభాకాంక్షలు తెలిపడం కోసం తొలిసారి సోషల్‌ మీడియాలోకొచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్దంగా ఉంది.