భారత్ తాత్కాలిక కోచ్‌గా రమేశ్‌ పవార్‌..

SMTV Desk 2018-07-16 15:54:39  team india coach temporary, ramesh power, team india womens coach, bcci

ముంబై, జూలై 16 : టీమిండియా మహిళల క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్‌గా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌ని బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఇటీవల ముంబై జట్టు కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్న పవార్.. లక్కీగా ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం భారత్‌ మహిళల జట్టు కోచ్‌ తుషార్‌ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. కొత్త కోచ్‌ ఎంపికయ్యే వరకూ ఆ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా రమేశ్ పవార్‌ని బీసీసీఐ కోరింది. రమేశ్‌ పవార్‌ భారత్‌ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు. భారత మహిళల జట్టు కోచ్‌ కోసం ఇప్పటికే బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. తుది గడువును జులై 20 అని ప్రకటించింది. అభ్యర్థుల వయసు 55లోపు ఉండాలనేది ప్రాథమిక షరతుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూలై 25 నుంచి ఆగస్టు 3 వరకు భారత మహిళల జట్టుకి ఫిట్‌నెస్ క్యాంప్‌ను బెంగళూరులో నిర్వహించనున్నారు. ఈ క్యాంప్‌ను పర్యవేక్షించాల్సిందిగా రమేశ్ పవార్‌ని బీసీసీఐ ఆదేశించినట్లు తెలిసింది. క్యాంప్ తర్వాత భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనకి వెళ్లనుంది.