వాట్సప్‌లో ఈ ఆప్షన్ గురించి తెలుసా?

SMTV Desk 2017-07-16 11:39:36  social media, whatsapp, facebook, indians, top place, two step verification, email id., enable, disable, smart phone.

హైదరాబాద్, జూలై 16 : సోషల్‌మీడియా వాడుతున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని తాజాగా ఫేస్‌బుక్ విడుదల చేసిన జాబితాలో తెలిసింది. ఫేస్‌బుక్ అనుబంధమైన వాట్సప్‌ను కూడా భారతీయులు అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. అసలు ఈ రోజుల్లో వాట్సప్ లేని స్మార్ట్‌ఫోన్లు లేవు. చాలామంది వాట్సప్ వాడుతుంటారు కానీ, అందులో ఉన్న ఫీచర్స్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. వాట్సప్ ను కూడా హ్యాక్ చేస్తున్న తరుణంలో వచ్చిన ఓ కొత్త సెక్యూరిటీ ఫీచరే "టూ స్టెప్ వెరిఫికేషన్". ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే చాలు మన వాట్సప్‌ను హ్యాకర్ల భారీ నుంచి రక్షించుకోవచ్చు. అసలు ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే... వాట్సప్ ఓపెన్ చేయగానే పై భాగంలో కుడివైపున మూడు చుక్కల వద్ద ప్రెస్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అందులో అకౌంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగానే ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ అనే ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలంటే ఆరు అంకెల పిన్‌ను సెట్ చేసుకోని తర్వాత ఈమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయాలి. ఈ మెయిల్ ఐడీ ఇవ్వకుండా స్కిప్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది కాని ఈమెయిల్ ఐడీ ఇస్తే ఎప్పుడైనా పిన్ మర్చిపోయినా మెయిల్ ద్వారా రికవరీ చేసుకోవచ్చు. దీంతో ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ ఎనేబుల్ అవుతుంది. ఈ ఆప్షన్‌ను డిసబుల్ చేయవచ్చు. అంతేకాకుండా పిన్, మెయిల్ ఐడీలను మార్చుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. వాట్సప్‌కు వంద శాతం సెక్యూరిటీ కావాలనుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.