హిమదాస్ కు టాలీవుడ్ స్టార్స్ ప్రశంసలు..

SMTV Desk 2018-07-14 16:42:49  track and feild event, junior athletic himadas, tollywood young heroes response.

హైదరాబాద్, జూలై 14 : జూనియ‌ర్ అథ్లెటిక్ చాంపియ‌న్ షిప్‌లో భారతీయ క్రీడాకారిణి హిమదాస్ సంచలనం సృష్టించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకం సాధించి౦ది. ఈ ఈవెంట్స్‌లో భార‌త్‌కు ల‌భించిన తొలి బంగారు ప‌త‌కం ఇదే కావ‌డం విశేషం. దీంతో ఈ ఘనతను సాధించిన హిమ దాస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెను టాలీవుడ్ స్టార్ హీరోలు అభినందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసించారు. ఈ మేరకు ట్విట్టర్ లో.. * మహేష్ బాబు : భారత క్రీడారంగంలోనే అత్యంత అరుదైన విజయాలలో ఇదీ ఒకటి. హిమదాస్ అద్భుత ప్రతిభ కనబరిచావు. చాలా గర్వంగా ఉంది. కంగ్రాట్స్ హిమదాస్. * ఎన్టీఆర్ : చరిత్ర సృష్టించిన హిమదాస్ కు హృదయపూర్వక అభినందనలు.. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో స్వర్ణం నెగ్గిన అథ్లెట్ గా నిలిచారు. ఇది గొప్ప సంతోషకరమైన సమయం. * హిమదాస్ కు సెల్యూట్.. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు. దేశం యావత్తు మీకు సెల్యూట్ చేస్తోంది.