వివాదస్పద వ్యాఖ్యలు చేసిన శశి థరూర్‌

SMTV Desk 2018-07-12 17:34:47  congress leader Shashi Tharoor, Shashi Tharoor, bjp vs congress, rahul gandhi

న్యూఢిల్లీ, జూలై 12 : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ 2019 లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత్‌ను హిందూ పాకిస్తాన్‌గా మారుస్తుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఆయన ఆ వ్యాఖ్యలను సమర్ధించుకొన్నారు. హిందూ రాజ్య భావన పట్ల బీజేపీకి విశ్వాసం లేకుంటే ఆ విషయం స్పష్టంచేయాలని.. బీజేపీ సిద్ధాంతాన్ని తాను నేరుగా తన వ్యాఖ్యల్లో చెప్పానని శశి థరూర్‌ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆ పార్టీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ థరూర్‌ను అవసరమైతే మెంటల్‌ హాస్పిటల్‌కు పంపించాల్సిందిగా సూచించారు. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర డిమాండ్‌ చేశారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల మూల సిద్ధాంతాన్నే తాను ప్రస్తావించానని, హిందూ రాష్ట్ర భావనపై వారికి విశ్వాసం లేదని స్పష్టంగా ప్రకటిస్తే చర్చ ముగుస్తుందని అన్నారు.