రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు..

SMTV Desk 2018-07-12 13:58:01  telangana heavy rains, heavy rains in adilabad, hyderabad, imd

హైదరాబాద్, జూలై 12 : తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ఆవర్తనంతో రెండు రాష్ట్రాలు తడిసి ముద్దవతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ పరిసరాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర కోస్తా ఒడిశా పరిసరాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్‌, కుమ్రంభీం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉండగా నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు పేర్కొ