పవన్ పై దాడి తీవ్రతరం..

SMTV Desk 2018-07-11 12:01:55  p0awan kalyan, janasena vs tdp, tdp leaders, ycp

అమరావతి, జూలై 11 : ఏపీలో అధికార టీడీపీ పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ చేస్తున్న విమర్శలకు ఇక నుంచి దీటుగా బదులివ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు విమర్శనాస్త్రాలకు పదును పెడుతోంది. పవన్ చేస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ వాటిలోని డొల్లతనాన్ని బయటపెట్టేలా అధినాయకత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా సాగడంతో.. పవన్‌కల్యాణ్ అప్పుడప్పుడూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా తెలుగుదేశం నాయకులు అంతే ఘాటుగా స్పందించడం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పవన్ ఆరోపణలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన టీడీపీపై ఇకపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. వైసీపీ ఏ స్థాయి విమర్శలు చేస్తున్నామో అదే స్థాయిలో జనసేనపై విరుచుకుపడాలని అధిష్ఠానం నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌ పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం పై తెలుగుదేశం నేతలు ఆగ్రహంగా ఉన్నారు.