రియల్‌ మాడ్రిడ్‌ టూ జువెంటస్‌..

SMTV Desk 2018-07-11 11:36:51  Cristiano Ronaldo, Juventus club, Real Madrid , madric

మాడ్రిడ్‌, జూలై 11 : ప్రపంచ అత్యుతమ ఫుట్ బాల్ ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో పేరు తప్పనిసరిగా ఉండాలి. అంతలా అతని ఆటతీరుతో అభిమానులను సంపాదించుకొన్నాడు ఈ పోర్చుగల్ వీరుడు. తాజాగా రోనాల్డో తొమ్మిదేళ్లపాటు రియల్‌ మాడ్రిడ్‌కు వెన్నెముకగా నిలిచిన ఈ స్టార్ ఇక నుంచి ఇటాలియన్‌ చాంపియన్స్‌ జువెంటస్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. 2009లో రికార్డు స్థాయిలో రూ.730 కోట్ల ధరకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు తరలివచ్చాడు. ఈ జట్టుకు రొనాల్డో నాలుగు చాంపియన్స్‌ లీగ్‌, రెండు లా లిగా టైటిల్స్‌ను అందించాడు. ఇన్నాళ్లు తమ క్లబ్‌ తరఫున ఆడినందుకు అతడికి కృతజ్ఞతలు చెప్పింది. అయితే ఎంత మొత్తానికి రోనాల్డో బదిలీ అయ్యాడో వెల్లడించలేకపోయిన ఒప్పందం విలువ 120 మిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.