ఫిఫా-2018 : ఫైనల్లో ఫ్రాన్స్..

SMTV Desk 2018-07-11 11:15:42  #fifa-2018 semi final, france vs belgium, russia, fifa final-2018

రష్యా, జూలై 11 : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ -2018 ఫైనల్లోకి ఫ్రాన్స్‌ దూసుకెళ్లింది. కీలకమైన పోరులో బలమైన ఫ్రాన్స్‌ బెల్జియం జట్టును 1-0తో ఓడించింది. దీంతో సంచలన విజయాలతో సెమీస్‌కు చేరిన బెల్జియం ఆశలకు గండి పడింది. రెండు జట్లు హోరా హోరీగా పోరాడటంతో సెమీస్‌లో తొలి అర్ధభాగం వరకు ఒక్క గోల్‌ సైతం నమోదు కాలేదు. ప్రత్యర్థులిద్దరూ చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే 51వ నిమిషంలో శామ్యూల్‌ ఉమ్‌టిటి అద్భుతమైన హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి ఫ్రాన్స్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 1998లో విజేతగా నిలిచిన ఆ జట్టు 2006లో రన్నరప్‌గా నిలిచింది. నేడు ఇంగ్లండ్‌, క్రొయేషియా తలపడే రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం మాస్కోలోని లుహినికి స్టేడియంలో ఫ్రాన్స్‌ ఫైనల్‌ ఆడనుంది. ఇక మూడో స్థానం కోసం ఓడిన జట్టుతో బెల్జియం తలపడనుంది.