సోనాలీ భావోద్వేగపు పోస్ట్..

SMTV Desk 2018-07-10 16:24:42  sonali bindre, cancer treatment, newyork, sonali instagram post viral.

హైదరాబాద్, జూలై 10 : ప్రముఖ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్‌ క్యాన్సర్‌ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చికిత్స నిమిత్తం న్యూయార్క్‌ లో ఉన్నారు. సొనాలీకి కేన్స‌ర్ అని తెలియ‌గానే ఎంతో మంది అభిమానులు, సినీ ప్ర‌ముఖులు విచారం వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌గా కోలుకుని క్షేమంగా తిరిగి రావాల‌ని సందేశాలు పంపిస్తున్నారు. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లోని ఓ హాస్పిట‌ల్‌లో ఉన్న సొనాలీ.. చికిత్స నిమిత్తం జుట్టు క‌త్తిరించుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ మేరకు.. "నేను ఎంత‌గానో అభిమానించే ర‌చ‌యిత్రి ఇసాబెల్ అలాండే మాటల‌ను నిత్యం గుర్తు చేసుకుంటాను. క‌ష్టాలు వ‌చ్చిన‌పుడే మ‌న‌లో దాగి ఉన్న శ‌క్తి బ‌య‌ట‌కు వ‌స్తుంది. నిజానికి విషాద‌క‌ర స‌మ‌యాల్లోనే మ‌నుషులు అద్భుతాలు చేస్తారు. మ‌నుగ‌డ సాగించేందుకు మాన‌వులు చేసే ప్ర‌య‌త్నం నిజంగా అత్య‌ద్భుతం. కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరు నాపై కురిపిస్తున్న ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు ధ‌న్య‌వాదాలు. ఈ విశాల ప్ర‌పంచంలో నేను ఒంట‌రిదాన్ని కాద‌నే భావ‌న నాలో కొత్త ఆశ‌ల‌ను క‌లిగిస్తోంది" అంటూ ఎంతో భావోద్వేగంతో పోస్ట్ చేశారు.