ఆయన వల్లే నేను పెళ్ళిచేసుకోలేదు..

SMTV Desk 2018-07-10 12:08:13  heroine tabu, akshay kumar, tabu marriage issue.

ముంబై, జూలై 10 : టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకొని ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఎదిగిన స్టార్ హీరోయిన్ టబు. నలబై పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది. ఇంతకు తను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఆయనే కారణం అంటోంది. ఆయన ఎవరు అనుకుంటున్నారా.? అతను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఈ విషయంపై తాజాగా టబు స్పందిస్తూ.. "నేను వివాహం చేసుకోకపోవడానికి నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ కారణం. తను నా సోదరుడుకి (దగ్గర బంధువు) మిత్రుడు. నా జీవిత ఆరంభం నుంచే నాకు అజయ్‌ తో మంచు స్నేహం ఉంది. మేమిద్దరం 25 ఏళ్లు స్నేహితులుగా మెలిగాం. అజయ్‌ దేవ్‌గన్‌ కారణంగానే నేను వివాహం చేసుకోలేదు. అందుకు నాకు బాధ లేదు" అంటూ పేర్కొన్నారు. ఇంతకు ఎలా కారణం అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే టబు, అక్షయ్ కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత అజయ్‌దేవ్‌గన్‌ నటి కాజోల్‌ను 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.