వైరల్ : ఈ మనుషులకేమైంది.. ప్రశ్నిస్తున్న బిగ్ బి..

SMTV Desk 2018-07-10 11:32:15  amitab bacchan, Instagram photo viral,

హైదరాబాద్, జూలై 10 : బాలీవుడ్ మెగాస్టార్.. అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రా‌మ్‌లో పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుత సమాజంలో కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయానికి ఇది అద్దం పడుతోంది. అమితాబ్ షేర్ చేసిన వెంటనే.. అత్యధికంగా లైక్స్ సాధించింది. ఈ ఫోటో ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. ఇంతకు బిగ్ బి పోస్ట్ చేసిన ఫోటో ఏంటంటే.. అమితాబ్ కుటుంబం మొత్తం ఒకే హాల్‌లో ఒకరికి ఒకరు అందేంత దూరంలో కూర్చున్నా, అక్కడంతా నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది. అదేంటి అని ఆలోచిస్తున్నారా.! వారందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. వారంతా ఆ ఫోన్లలో బిజీగా ఉన్నారు. ఈ ఫోటోలో చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా, అభిషేక్ బచ్చన్, మనవళ్లు నవ్యా నావెలి నందా, అగస్త్య తదితరులు ఉన్నారు. ఈ మేరకు బిగ్ బి.. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. "అందరూ ఒక చోటే ఉన్నారు. వారితో ఫోన్లు కూడా ఉన్నాయి" అంటూ కామెంట్ పెట్టారు. కానీ ఒక్క నవ్య ఒక్కర్తే పుస్తకం చదువుతూ కూర్చోవడం విశేషం. ఈ ఫోటోను చూస్తుంటే.. ప్రస్తుతం సమాజంలో మానవ విలువలకు అద్దం పట్టేలా ఉంది. మానవ విలువలకు కాకుండా సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం స్పష్టంగా కనిపిస్తోంది.