మరోసారి సంచలనం రేపిన ట్రంప్ వ్యాఖ్యలు

SMTV Desk 2017-07-15 14:36:40  TRUMP, BRIGETTE, ISMANYUYEL, MELANIA, FACEBOOK VIRAL VIDEO.

వాషింగ్టన్, జూలై 15 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఫ్రాన్సులో పర్యటిస్తున్న ఆయన.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భార్య బ్రిగెట్టి అందం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, మెలనియా తిరిగి ఫ్రాన్స్ నుండి బయలుదేరే ముందు ఆయన బ్రిగెట్టి పై ప్రశంశల వర్షం కురిపించారు. ‘మీరు చాలా అందంగా ఉన్నారు, చక్కటి శరీరాకృతి కలిగి ఉన్నారు’ అంటూ పొగడడం ప్రారంభించారు. ఫ్రెంచ్ ప్రభుత్వ అధికార ఫేస్‌బుక్ పేజిలో ఉంచిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. కాగా ట్రంప్ గతంలో మహిళలపై ఎన్నోసార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.