కాంగ్రెస్ లోకి నల్లారి.. ముహూర్తం ఖరారు..

SMTV Desk 2018-07-09 13:37:47  nallari kiran kumar reddy, ap former cm kiran kumar reddy, ap congress, amaravathi

అమరావతి, జూలై 9 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 13న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. గత కొన్ని రోజులుగా ఆయన సొంత గూటికి చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై స్పందించిన ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ధ్రువీకరించారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చాందీకి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాందీ మాట్లాడుతూ.. ఈనెల 13న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరనున్నారని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం నెలాఖరు వరకు 13 జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహించనున్నట్లు ఊమెన్‌ చాందీ తెలిపారు.