రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

SMTV Desk 2018-07-08 17:18:17  weather report, telangana, heavy rains in telangana, cm kcr.

హైదరాబాద్, జూలై 8 : రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు జోరుగా కదులుతున్నాయి. దీంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండి, పరిస్థితులను సమీక్షించాలని, వర్షాల కారణంగా ఎవరైనా నష్టపోతే వారికి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా అధికారులంతా స్థానికంగానే ఉండి సమన్వయంతో పను చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రులు రేపు జిల్లాల్లోనే ఉండాల్సి ఉన్నందున రేపు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.