రహస్యంగా ప్రియాంక ఎంగేజ్‌మెంట్‌..!!!

SMTV Desk 2018-07-08 12:55:02  priyanka chopra, nik jonas, priyanka engagement,

ముంబై, జూలై 8 : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. గత కొంత కాలంగా హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే తన తల్లి మధుకు కు కూడా నిక్‌ను పరిచయం చేశారు ప్రియాంక.. వీలు కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రియాంక, నిక్‌ల చేతులకి ఒకే మోడల్‌ రింగ్స్‌ ఉండటంతో ఈ వార్తలు నిజమేనని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు ప్రేమ, పెళ్లిలపై ప్రియాంక ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ జంట వీలు కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చేతిలో చేయి వేసుకొని న్యూయార్క్‌ వీధులో షికారు చేస్తున్నారు. సైక్లింగ్‌ చేస్తూ వీధులన్నీ చుట్టేస్తున్నారు. మరి ఈ వార్తలపై ఓ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.