ప్రియాంక ప్రేమ.. ఎందాకమ్మా..!!

SMTV Desk 2018-07-07 16:22:01  priyanka chopra, nik jonas, love birds.

ముంబై, జూలై 7 : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. గత కొంత కాలంగా హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రియాంక చోప్రా ముంబైలో తన నూతన గృహప్రవేశానికి గెస్ట్‌గా బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌ జోనస్‌ను ఆహ్వానించారు. ఈ మధ్యే తన తల్లి మధుకు కు కూడా నిక్‌ను పరిచయం చేశారు ప్రియాంక.. వీలు కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చేతులు కలుపుకుంటూ న్యూయార్క్‌ వీధులో షికారు చేస్తున్నారు. సైక్లింగ్‌ చేస్తూ వీధులన్నీ చుట్టేస్తున్నారు. ఇలా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట కలసి ఏడడుగులు ఎప్పుడేస్తారని ఎదురు చూస్తున్నారు ప్రియాంక అభిమానులు. అయితే నిక్ తో ప్రేమ విషయంపై ఇప్పటికీ ప్రియాంక స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డు సృష్టించింది. తనను అత్యధిక౦గా ఫాలో అవుతున్న వారి సంఖ్య 25 మిలియన్ మార్కును దాటింది. ఈ సందర్భంగా ప్రియాంక.. "25 మిలియన్.. మీ ప్రేమకు కృతజ్ఞతలు." అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.