దేవిశ్రీ దర్శకత్వంలో సుకుమార్ యాక్టింగ్..

SMTV Desk 2018-07-07 15:30:36  DEVISREE PRASAD, SUKUMAR, DEVISREE MUSIC PROMO VIDEO, LAUNCHED BY SAMANTHA.

హైదరాబాద్, జూలై 7 : సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ దర్శకత్వంలో స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ నటించారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.? అవును అది నిజమే. కానీ అది సినిమా కాదు. జస్ట్ ఒక ప్రోమో వీడియో. దేవిశ్రీ ప్రసాద్ కేవలం సినిమాలకు సంగీతం అందించడమే కాదు.. సంగీత కచేరీలు కూడా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా ఫారిన్‌లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఆగస్టు 11 నుంచి సెప్టెంబరు 16 వరకు అమెరికాలోని ఆరు నగరాల్లో ఈ కన్సర్ట్ నిర్వహించబోతుండటం విశేషం. ఈ షోకు సంబంధించిన ప్రోమోనూ దేవీ శ్రీ స్వయంగా డైరెక్ట్‌ చేశారు. ఇందులో సుకుమార్ నటించగా.. దేవిశ్రీ దర్శకత్వం వహించాడట. అయితే ఈ ప్రోమో ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటలకు సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.