బీహార్ లో దారుణం..

SMTV Desk 2018-07-07 13:45:49  Bihar Teen Raped, bihar rape incident, pocso act, bihar

చాప్రా, జూలై 7 : దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన కొంత మందిలో మార్పు రావడం లేదు. అప్పటిలో నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం తీసుకురాగానే హమ్మయ్య ఆడపిల్లకు భరోసా దొరికిందనుకున్నాం. అయితే, ఆడుతూపాడుతూ తిరిగే బాలికల మీద అత్యాచారానికి పాల్పడుతుండటంతో అమ్మలందరూ ఆక్రోశించారు. అలాంటి మృగాళ్లకు ఉరివేస్తామంటూ పోక్సో చట్టం తెచ్చారు. అయితే ఏ చట్టం శిక్ష పడుతుందన్న భయం ఏ ఒక్కరికి కలిగించలేకపోతోంది. తాజాగా బిహార్‌లోని సరన్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదమూడేళ్ల బాలికపై ఏకంగా 18 మంది ఏడు నెలల పాటు అత్యాచారం చేశారు. దారుణమమేటంటే.. పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కూడా ఉండడం. ఏడు నెలల సమయంలో తనపై పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు, 15 మంది విద్యార్థులు అఘాయిత్యం చేశారని బాలిక ఎక్మా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. గత ఏడాది డిసెంబరులో తన తండ్రి జైలుకు వెళ్లినప్పటి నుంచి తనపై ఈ అఘాయిత్యాలు మొదలయ్యాయని. చెప్పి.. ఫిర్యాదులో 18 మంది పేర్లను వెల్లడించింది. తన క్లాస్‌మేట్‌ మొదట అత్యాచారం చేసి ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించాడని, ఆ తర్వాత మరో నలుగురైదుగురు విద్యార్థులు.. పాఠశాల ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు తనపై అత్యాచారాలు చేస్తూ వచ్చారని బాలిక వెల్లడించింది. ఎక్మా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్‌ను, ఓ ఉపాధ్యాయుడిని అరెస్ట్‌ చేసి.. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.