నేను విడాకులు అడగలేదు.. : రేణు దేశాయ్..

SMTV Desk 2018-07-07 13:37:10  renu desai, divorce issue, pawan kalyan,

హైదరాబాద్, జూలై 7 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి చాలాకాలమే అయినా.. ఈ ఇద్దరిలో ఎవరు విడాకులు కోరారనే విషయాన్ని మాత్రం ఎవరు ప్రస్తావించలేదు. ఈ విషయంపై చాలాసార్లు రేణుకు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినా ఆమె వాటిని పట్టించుకోకుండా సమాధానాన్ని ఇవ్వలేదు. ఈ ప్రశ్న ఆమెకు ఈ మధ్య తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. ఎన్నో ఇంటర్య్వూలో దాటవేస్తూ వచ్చిన ప్రశ్నకు తాజాగా సమాధానం ఇచ్చారు. ఈ మేరకు విడాకులకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు. "ఇంతవరకు ఈ ప్రశ్న ఎదురైనా నేను ఎక్కడా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నేను వేరే ఇంటికి కోడలిగా వెళుతున్నా. వాళ్లు కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. ఈ సారి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. విడాకులు నేను అడగలేదు. విడాకులు కావాలని ఆయనే అడిగారు.. నాకు కోపం వచ్చింది. విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందో.. మా మధ్య అదే జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా బాధగా వుంది" అంటూ చెప్పుకొచ్చారు.