మరాఠా ప్రజలకు బాలీవుడ్ హీరో క్షమాపణలు..

SMTV Desk 2018-07-06 19:01:35  ritesh deshmukh, recent photoshoot, marata people, ritesh deshmukh sorry to marata people.

ముంబై, జూలై 6 : బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తీసుకున్న ఓ ఫోటోషూట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు స్పందించిన రితేశ్‌.. మరాఠా ప్రజలకు క్షమాపణలు చెబుతూ.. ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. ముంబైలోని రాయ్‌గఢ్‌ ఛత్రపతి శివాజీ కోటను సందర్శించిన రితేశ్.. అక్కడి ఛత్రపతి శివాజీ విగ్రహం ముందు ఫొటోషూట్‌ నిర్వహించారు. అంతేకాదు ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజన్లు మండిపడుతూ.. "అక్కడ ఫొటోలు దిగటం నిషిద్ధం. ఇదొక పనికిమాలిన చర్య" అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రితేశ్ స్పందిస్తూ.. తన ట్విట్టర్ వేదికగా.. "ఆయన(శివాజీ) పాదాల ముందు తలవంచి ఆశీస్సులు పొందాను. ఎన్నో ఏళ్లుగా నేను ఈ పనులను చేస్తున్నాను. ఆయన పట్ల గల భక్తి భావంతోనే అక్కడ ఫొటోలు దిగాను కానీ ఎవరి మనోభావాలో దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు. నా ఈ చర్య వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి" అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై బీజేపీ ఎంపీ స్పందిస్తూ.. అక్కడ ఫొటోలు దిగటం నిషిద్ధం. ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. రితేశ్‌ చర్యను ఖండిస్తున్నా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.