నేడు కలాం మ్యూజియం ప్రారంభం....

SMTV Desk 2017-07-14 20:06:47  Dr. Ollal Pukir Jainulabuddin Abdul Kalam, MUJIYAM, THIRUVANANTHAPURAM

తిరువనంతపురం, జూలై 14 : భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, 11వ భారత రాష్ట్రపతి. అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియంను తిరువనంతపురంలో గురువారం ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. డాక్టర్ కలాం జ్ఞాపకార్ధం స్మృతి ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ స్పేస్ మ్యూజియం పేరిట దీన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి వసతులు గల మ్యూజియం దక్షిణ భారతంలో ప్రారంభించడం ఇదే మొదటిసారి. మాజీ రాష్ట్రపతి కలాం వ్యక్తి గత స్మృతులకు నిలయమైన ఈ మ్యూజియంలో చాలా అరుదైన ఫొటోగ్రాఫ్ లు, రాకెట్లు, ఉప గ్రహాల నమూనాలు తదితరాలు ఉన్నాయి.