గాంధీ రూపంలో మన మధ్య... కేంద్ర మంత్రి శర్మ

SMTV Desk 2017-07-14 19:24:41  CENTRAL MINISTER, MUKESH SHARMA, MAHATHMAGANDHI, NARENDRAMODI,

న్యూఢిల్లీ, జూలై 14 : నేటి ప్రధాని అప్పటి మహాత్మాగాంధీ అంటున్న కేంద్ర మంత్రి మహేశ్ శర్మ... గాంధీ ఉప్పు సత్యాగ్రహం పై జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... "ఇవాళ ప్రధానమంత్రి రూపంలో మరో గాంధీజీ మనందరి మధ్య ఉన్నారు. ఇంతటి మహోన్నత వ్యక్తి మన మధ్య ఉండడం నిజంగా మనం అదృష్టవంతులం" అని ఆయన సంతోషం తో అన్నారు. మోదీ ఒక స్పూర్తి మంత్రమని ఆయన పేర్కొన్నారు. ఉప్పు సత్యగ్రహం అంటే కేవలం ఒక చిటికెడు ఉప్పు మాత్రమే కాదనీ.. తరతరాలకు స్పూర్తినిచ్చే విషయమన్నారు. అదే పంథాలో ప్రధాన మంత్రి మోదీ పయనిస్తున్నారని శర్మ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతిఒక్కరికీ స్వాంతంత్ర్య ఫలాలను అందించడమే తన లక్ష్యమంటూ ప్రధాని తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గాంధీజీ ఆశయాలను సాకారం చేయడమే మోదీ కళ. సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆయన కళలు, ఆలోచనలు నెరవేర్చేందుకు నిబద్ధత కలిగి పనిచేస్తుంది అని శర్మ తెలిపారు.