సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల చిచ్చు

SMTV Desk 2017-05-29 18:25:58  singareni,labours,jobs,volentery jobs

కరీంనగర్, మే 29 : సింగరేణి సంస్థకు వారసత్వ ఉద్యోగాల శక మెుదలయింది. వారసత్వ ఉద్యోగాల నియామకాలు నిలిచిపోవడంతో ఆందోళనకు గురైన కార్మిక సంఘాలు సమ్మేకు సిద్దం అయ్యాయి. జూన్ 15 నుంచి సమ్మె నిర్వహించేందుకు ఐదు జాతీయ కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. హైదరాబాద్ లో డిప్యూటి లేబర్ కమిషనర్ వద్ద చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమని కార్మిక నాయకులు వెల్లడిస్తున్నారు. వారసత్వ ఉద్యోగాల నియామకానికి ముఖ్యమంత్రి కేసిఆర్ అదేశించడంతో సింగరేణి యాజమాన్యం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. అయితే కోర్టు మాత్రం నియామక ప్రక్రియ నిలిపివేయాలని స్టే విధంచడంతో అందుకు సంబంధించిన కార్యచరణ నిలిపేశారు. ఈ విషయమై అటార్ని జనరల్ అభిప్రాయం కోసమై సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నది. సింగరేణి యాజమాన్యం నెలరోజుల గడువు కోరినప్పటికి కార్మికులు మాత్రం సమ్మెకు సిద్దం అవడంతో మరో మారు సింగరేణి బోగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.