సినిమాలకు సమంత గుడ్ బై..??

SMTV Desk 2018-07-06 13:28:34  Samantha to quit films, akkineni samantha, new movies samantha.

హైదరాబాద్, జూలై 6 : అగ్ర కథానాయికలలో ఒకరిగా కొనసాగుతున్న అక్కినేని కోడలు సమంత.. ఇక సినిమాకు గుడ్ బై చెప్పనుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోవడం లేదని... 2019 మార్చి కల్లా ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి, సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని సమంత స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో యూటర్న్‌ రీమేక్‌, తమిళంలో సెమ్మ రాజా, సూపర్‌ డీలక్స్‌ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. వీటితోపాటు నిన్ను కోరి ఫేమ్‌ శివ నిర్వాణ డైరెక్షన్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కించబోయే ఓ ప్రాజెక్టులోనూ ఆమె నటించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొత్త ప్రోజెక్టులేవి ఈ అమ్మడు ఒప్పుకోకపోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి ఈ వార్తలపై సమంత ఏమంటుందో చూడాలి.