బర్త్ డే వేడుకల్లో నందమూరి ఫ్యామిలీ..

SMTV Desk 2018-07-06 12:16:26  nandamoori kalyan ram, kalyan ram birthday, abhay ram,

హైదరాబాద్, జూలై 6 : ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ నిన్న తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. 40ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నయ్య పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. అన్నయ్యతో కేక్ కట్ చేయించి తినిపించాడు. బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మధ్యకాలంలో అన్నదమ్ములిద్దరి మధ్య అనుబంధం రెట్టింపు అయింది. ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు హాజరవుతూ.. అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బర్త్ డే ను పురస్కరించుకొని నందమూరి అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 16వ సినిమాను కేవీ గుహాన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మేరకు ఆయన బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.