రజినీకాంత్ జోడీగా సిమ్రాన్..?

SMTV Desk 2018-07-05 15:43:14  rajinikanth, heroine simran, karthik subbaraju, sun picture.

హైదరాబాద్, జూన్ 5 : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే రజినీ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ సిమ్రాన్.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ మధ్యనే తమిళ చిత్రంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ భామ.. రజినీకాంత్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అనుకోని అవకాశం తన తలుపు తట్టడంతో సిమ్రాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 రోజులపాటు డార్జిలింగ్ లో షూటింగ్ జరపడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.