సుహానా.. ఏంటి ఈ పని..?

SMTV Desk 2018-07-05 12:41:53  suhana khan, sharukh khan, suhana khan Instagram pic goes viral.

ముంబై, జూలై 5 : బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫోటోతో తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొంటుంది. షారూఖ్‌ ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్‌ ట్రిప్‌కు వెళ్ళారు. ఈ సందర్భంగా సుహానా టూ పీస్‌ బికినీ వేసుకున్న హాట్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. "నువ్వొక ముస్లింవి అనే సంగతి మరిచిపోకు., సిగ్గు లేదా?.. నీ ప్రైవసీ నీది కావొచ్చు, కానీ, ఇలాంటి ఫోటోలు దేశమంతా చూస్తుందన్న విషయం మరిచిపోకు.., నువ్వు సంప్రదాయాలను కూడా పాటిస్తే మంచిది.. మీ తండ్రి అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ, ఇలాంటి పనులతో పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. సుహానా పోస్ట్ చేసిన ఫోటోలో షారూఖ్‌ చిన్న కొడుకు అబ్‌రామ్‌ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

My hotty babeis

A post shared by suhana khan (@suhanakha2) on