కన్నాపై చెప్పుల దాడి.. ఆగ్రహిస్తున్న బీజేపీ నేతలు..

SMTV Desk 2018-07-04 19:16:36  nellore, ap bjp president kanna lakshmi narayana, tdp party,

నెల్లూరు, జూలై 4 : నెల్లూరు జిల్లాలో కావలిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు ఆయనపై చెప్పులతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. బీజేపీ నుండి వైదొలగిన తర్వాత టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరికొకరు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సోమువీర్రాజు మాట్లాడుతూ.. టీడీపీ నేతలు కొరివితో తల గొక్కు౦టున్నారని, ఇటువంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు వక్రబుద్దికి సరైన గుణపాఠ౦ చెబుతామని పేర్కొన్నారు.