అశ్లీల వెబ్ సైట్లకు కేంద్రం కళ్లెం....

SMTV Desk 2017-07-14 16:35:49  3,500 porn websites, black, central government

న్యూఢిల్లీ, జూలై 14 : ప్రస్తుత కాలంలో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న 3,500 అశ్లీల వెబ్ సైట్లను బ్లాక్ చేశామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈని కోరామని కోర్టుకు కేంద్రం నివేదించింది. పాఠశాల వరకు జామర్లు ఏర్పాటు చేయడం కుదురుతుందని కానీ స్కూల్ బస్సుల్లో కూడా జామర్ల ఏర్పాటు చేయడం వీలు కాదు.. అయితే అశ్లీల వెబ్ సైట్ల ఏరివేతకు సంబంధించిన ఏదో ఒక ప‌రిష్కారాన్ని త్వ‌ర‌లో రూపొందిస్తామని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ పింకీ ఆనంద్ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు వివరించారు . ఈ నేపథ్యంలో అశ్లీల వెబ్‌సైట్ల ఏరివేత‌కు సంబంధించిన రిపోర్టును రెండ్రోజుల్లోగా ప్ర‌వేశ పెట్టాల‌ని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. పిల్లలు ఇలాంటి వాటి బారిన పడకుండా త్వరగా కేంద్రం దీనిపై స్పందించాలని పాఠశాల యాజమాన్యం కోరుతుంది.