ఫిఫా -2018 : జపాన్ పై బెల్జియం విజయం

SMTV Desk 2018-07-03 11:40:13  fifa-2018, fifa kncok out matches, japan vs russia,

మాస్కో, జూలై 3 : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ నుండి జపాన్ జట్టు నిష్క్రమించింది. నాకౌట్‌ లో భాగంగా సోమవారం బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగింది. ఇరు జట్ల మధ్య హోరాహోరాగా సాగిన పోరులో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన బెల్జియం 3-2 తేడాతో గెలుపొందింది. మొదటి అర్ధభాగం ముగిసే వరకు ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయలేదు. దీంతో సెకండ్‌ హాఫ్‌ ఆసక్తిగా మారింది. రెండో అర్థ భాగం ఆరంభంలో 2-0తో వెనుకబడిన బెల్జియం.. ఆ తర్వాత అరగంట లోపు మూడు గోల్స్‌ సాధించి జపాన్‌కు షాకిచ్చింది. బెల్జియం ఆటగాళ్లలో జాన్‌ వెర్టోన్‌గెన్‌ గోల్‌ సాధించగా, ఫెల్లానీ రెండు గోల్స్‌ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ చరిత్రలో బెల్జియం క్వార్టర్స్‌కు చేరడం మూడోసారి కాగా, వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ గేమ్‌లో 2-0 వెనుకబడి ఆపై విజయాన్ని అందుకోవడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రత్యర్థిని కట్టడి చేయడంతో 3-2 తేడాతో మ్యాచ్‌ గెలిచిన బెల్జియం క్వార్టర్స్‌ చేరుకుంది. క్వార్టర్స్‌లో బెల్జియం జట్టు శుక్రవారం బ్రెజిల్‌తో తలపడనుంది.