సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌ అరెస్టు..

SMTV Desk 2018-07-03 11:06:18  katti mahesh arrest, cini critic katti mahesh, banjara hills ps, film nagar

ఫిలింనగర్‌, జూలై 3 :సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ ను సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహేష్ గత రెండురోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌ చర్చ వేదికలో సీతారాములను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని విచారణకు తీసుకెళ్లారు. బంజారాహిల్స్ పీఎస్‌లో ఆయన్ను ప్రశ్నించారు. కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌ ఫోన్‌ లైన్ లో మాట్లాడుతూ.."రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా" అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్యదైవం రాముడిపై కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.